New Rules For Social Media : సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.

New Rules For Social Media : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. అవసరమైతే ఆ వాణిజ్య ఒప్పందాలను బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు నివారించేందుకు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రేటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ఎన్ డోన్ మెంట్స్ నో హౌస్ పేరుతో గైడ్ లైన్స్ విడుదల చేసింది.

NTR30: అసలే లేదంటే.. కొసరు వార్తలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉండే సెలబ్రెటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా లేదా కన్ ఫ్యూజ్ చేసేలా ఆయా ప్రొడక్టులు, సర్వీసులను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా గైడ్ లైన్స్ ప్రవేశపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు