NTR30: అసలే లేదంటే.. కొసరు వార్తలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

NTR30: అసలే లేదంటే.. కొసరు వార్తలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

NTR30 Heroine Janhvi Kapoor Remuneration Rumours Goes Viral

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా జాప్యానికి గల కారణాల్లో హీరోయిన్ ఎంపిక కూడా ఒక అంశంగా తెలుస్తోంది.

NTR: NTR30 నుంచి క్రేజీ అప్డేట్ ని ఇచ్చిన చిత్ర యూనిట్..

తొలుత ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడకి పెళ్లయిపోవడంతో, ఇప్పుడు వేరొక హీరోయిన్ కోసం కొరటాల అండ్ టీమ్ తెగ గాలిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది పేర్లు ఈ సినిమా కోసం వినిపించినా, ఎవరినీ ఫిక్స్ చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

NTR30: ఎన్టీఆర్-30లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. నిజమేనా?

ఇదిలా ఉండగానే, ఇప్పుడు మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు ఏక్ంగా రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా హీరోయిన్ ఫిక్స్ కాకముందే, ఇలాంటి రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఏమిటో అంటూ వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.