NTR30: ఎన్టీఆర్-30లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NTR30: ఎన్టీఆర్-30లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. నిజమేనా?

Young Beauty Sreeleela In NTR30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్ పేరు.. ఎవరంటే?

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించినా, చివరకు రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉండబోతుందని.. ఈ పాత్రలో నటించే ఛాన్స్ ఓ క్రేజీ యంగ్ బ్యూటీకి దక్కినట్లుగా తెలుస్తోంది. పెళ్లిసందD మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రీలీల ప్రస్తుతం యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన ఈ బ్యూటీని ఎన్టీఆర్30లో సెకండ్ హీరోయిన్‌గా కొరటాల సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

NTR30: కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా.. తారక్ షాకింగ్ డెసిషన్!

అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా సెలెక్ట్ అయితే అమ్మడికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఈ విషయంపై క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.