Corona Vaccine: కోవిడ్ వాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనా వాక్సినేషన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకిన బాధితులు..మహమ్మారి నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని స్పష్టం.

Corona Vaccine: కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో నిత్యం లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వాక్సిన్ ను వేగవంతం చేయాలనీ కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఈక్రమంలో కరోనా వాక్సినేషన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకిన బాధితులు..మహమ్మారి నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రికాషన్ డోసు విషయంలోనూ ఇదే పద్ధతి పాటించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్.. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సూచన మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు వికాస్ శీల్ పేర్కొన్నారు.

Also read: Corona New Zealand: మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ మహిళా ప్రధాని

ఇదిలా ఉంటే కరోనా వాక్సిన్ బూస్టర్ డోసు నిర్వహణ గురించి జరిపిన శాస్త్రీయ పరిశోధనలు విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కొన్ని దేశాలు బూస్టర్ షాట్‌లను నిర్వహించడానికి ఆరు నెలల కాలవ్యవధి సరైనదిగా భావిస్తుండగా, మరికొన్ని దేశాల్లో కోవిడ్ నుండి కోలుకున్న వెంటనే టీకాలు వేయవచ్చని పేర్కొన్నారు. టీకా ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలు(Antibodies) ఆరు నెలల్లో తగ్గడం ప్రారంభిస్తాయనే అంచనాపై ఆయాదేశాల వైద్య నిపుణులు మొదటి ప్రతిపాదన చేశారు.

Also read: Subhash Chandra Bose: నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలన్న మమతా బెనర్జీ

ఇక భారత్ లో కరోనా వాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతుంది. సాధారణ వ్యక్తులతో పాటు.. 15-18 ఏళ్ల వయసు వారికీ కోవిడ్ వాక్సిన్ అందిస్తున్నారు. ఫ్రంట్ లైన్ సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి మరియు 60 ఏళ్లు పైబడిన వారికీ జనవరి 10 నుంచి మూడో డోస్ కరోనా వాక్సిన్ అందిస్తున్నారు. అయితే తాజా మార్గదర్శకాలు అనుసరించి ఆయా వర్గాల వారికి కరోనా వాక్సిన్ పంపిణీ చేయాలనీ కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

Also read: Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

ట్రెండింగ్ వార్తలు