అదేంపని : మంత్రి ప్రెస్ మీట్ లో  ఎలా వెక్కిరిస్తుందో

  • Publish Date - February 2, 2019 / 05:11 AM IST

ఢిల్లీ : కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుకే నిలబడిన ఓ యువతి చేసిన కొంటెపని ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి జయంత్‌ సిన్హా..పార్లమెంట్ వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో మంత్రి వెనకే నిలబడిన ఓ యువతి నాలుకను బయట పెట్టి చూపిస్తు వెక్కిరించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

ఫిబ్రవరి 1న మంత్రి  పీయుష్ గోయల్, బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి  జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ ను ఆకాశానికెత్తేస్తు తెగ పొగిడేస్తున్నారు. అదే సమయంలో సదరు యువతి చేసిన ఈ  వీడియో నెటిజన్లు తెగ కామెంట్లు చేసేస్తున్నారు. “పీయుష్ గోయల్ బడ్జెట్ కు సూపర్ రివ్యూ” అని ఒకరు, “ఆమె తన అభిప్రాయం చెప్పిందని మరొకరు”… ఇలా సాగుతున్నాయి కామెంట్లు. ఆ వీడియోను మీరూ చూడండి.