Covid Vaccination
Vaccination Employee’s Family Members : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఒక పట్టాన వదలడం లేదు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ అన్ని దేశాల ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. భారతదేశంలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. రెండు డోస్ లు వేసుకోవాలని సూచిస్తోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ లను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
అయితే..ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై శాఖ పునరాలోచనలో పడింది. మునపటి నిర్ణయాన్ని సవరించాలని భావించింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్రాల అడ్వైజరీ జారీ చేసింది.
ప్రభుత్వ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 సంవత్సరాలు పైబడిన వారికోసం కేంద్రం రాష్ట్రాలకు అందించే కోటా నుంచి ఉచితంగా టీకాలు అందిస్తారు. కంపెనీలు తమ అంతర్గత పాలసీ మేరకు ఉద్యోగి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయవచ్చు. దీని ప్రకారం కంపెనీలు తమ అంతర్గత పాలసీ మేరకు ఉద్యోగి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయవచ్చు.
Read More : Traffic jam : ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్…ఈ పాస్ ఉంటేనే అనుమతి