Traffic jam : ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్…ఈ పాస్ ఉంటేనే అనుమతి

Traffic jam : ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్…ఈ పాస్ ఉంటేనే అనుమతి

Ap Telangana Border Traffic Jam (1)

AP-Telangana border traffic jam: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి..తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపి నుంచి తెలంగాణాకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో బోర్డర్లో భారీ ట్రాఫిక్ జామ్ తో గందరగోళం నెలకొంది. ఏపీ నుంచి తెలంగాణాలో హైదరాబాద్ కు వైద్యం కోసం వచ్చేవారిని తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే నిలిపివేయటంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అంబులెన్స్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులో పోలీసులు కేవలం ఎమర్జన్సీ ఉన్నవాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అలాగే ఈ పాస్ లు ఉన్నవారిని మాత్రమే తెలంగాణాలోకి అనుమతి ఇస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోను పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయగా..రామాపురం క్రాస్ రోడ్ వద్దా…సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లోను భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

పోలీసులు ఒక్కో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఈపాస్ లను చెక్ చేసి అవి ఉంటనే అనుమతి ఇస్తున్నారు. ఇతర వాహనాలకు ఏమీ కూడా అనుమతించటంలేదు. వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు భారీగా నిలిచిపోవటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది.