Ration Shops : నెలలో అన్ని రోజులూ రేషన్ షాపులు ఓపెన్

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.

ration shops కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో పలు చోట్ల పరిమిత సమయంలోనే రేషన్ పంచుతున్నారన్న కేంద్రం..సమయం కుదించడం వల్ల అందరికీ రేషన్ అందకపోవచ్చని పేర్కొంది. లాక్​డౌన్ కొనసాగుతున్నా రేషన్ షాప్​ల సమయాన్ని పొడిగించాలని కేంద్రం సృష్టం చేసింది.

నెలలో అన్ని రోజులు రేషన్‌ షాపులు తెరిచి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదివారం ఆదేశించింది. రాయితీ, ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు సురక్షితంగా, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు తెలిపింది.

జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) ద్వారా ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాన్ని రూ.1-3లకు కేంద్రం అందిస్తోంది. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో వారందరికి ప్రధాన్ మంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన ద్వారా 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా ఇస్తోంది. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మే-జూన్ వరకు ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున ఉచితంగా రేషన్​ అందజేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు