Central Government : కేంద్రం సంచలనం.. కాక్రోచ్లకు భారీ దెబ్బ..
Delhi Police Commissioner Gets NSA Powers : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ప్రత్యేక అధికారాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
Delhi Police Commissioner Gets NSA Powers
Delhi Police Commissioner Gets NSA Powers : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్దెత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులుసైతం రోడ్లపైకి వచ్చి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. రోజురోజుకు తీవ్రమవుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read : నీట్ పేపర్ లీక్ నిరసనల వేళ.. ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్..
ఢిల్లీలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ప్రత్యేక అధికారాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ అధికారాల ద్వారా అవసరమైతే ప్రజా భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులను మూడు నెలల కాలపరిమితిలో నిర్బంధంలోకి తీసుకునే అధికారం పోలీస్ కమిషనర్‌కు ఉంటుంది. ఈ అధికారాలు జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉండనున్నాయి.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం.. పోలీస్ కమిషనర్ ఈ అధికారాలను వినియోగించవచ్చు. అయితే, ఈ అధికారాలు శాశ్వతం కావని, నిర్దిష్ట కాలానికి మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధానిలో చట్టవ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడం, భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు, భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఎదురైతే ముందస్తు చర్యగా ఈ అధికారాలను వినియోగించే అవకాశం ఉంటుంది.
