మారటోరియం రెండేళ్లపాటు పొడిగింపు.. సుప్రీం కోర్టులో కేంద్రం

  • Publish Date - September 1, 2020 / 01:08 PM IST

Loan moratorium extendable upto 2 years: కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి లోన్లపై మారటోరియంను సెప్టెంబర్ నుంచి ఎత్తివేయడంతో తిరిగి లోన్ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా కారణంగా లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోగా.. తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.



ఈ క్రమంలో మారటోరియం సమయంలో కట్టాల్సిన ఈఎంఐలపై వడ్డీని బ్యాంకులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు లోన్లపై వడ్డీ విషయంలో కేంద్రాన్ని వివరణ కోరింది. దీనిపై కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. అన్నీ లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు వెల్లడించింది.
https://10tv.in/hyderabad-prostitution-racket-busted-in-jeedimetla-ps-limits-two-junior-artist-caught/
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి లోన్లపై మారటోరియం ప్రారంభం అవగా.. మార్చి 2021 వరకు కొనసాగిస్తామని కేంద్రం తెలిపింది. రెండేళ్ల మారటోరియంపై కేంద్రం కసరత్తు చేస్తుండగా.. ఇక ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ విధించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కట్టని ఈఎంఐలపై కూడా పెనాల్టీ విధించకూడదని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. దీనికి సంబంధించిన మారటోరియం కేసును కోర్టు రేపటికి వాయిదా వేసింది.



మారటోరియం అంటే ఏమిటంటే?
లోన్ మారటోరియం అనేది ఒక రకమైన సౌకర్యం, ఇది కరోనా ద్వారా ప్రభావితమైన వినియోగదారులకు లేదా సంస్థలకు ఇవ్వబడింది. దీని కింద, కస్టమర్లు లేదా కంపెనీలు తమ నెలవారీ వాయిదాలను వాయిదా వేయవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తక్షణ ఉపశమనం లభిస్తుంది కాని తరువాత ఎక్కువ డబ్బు చెల్లించాలి. మార్చి నుంచి ఈ సౌకర్యం ఆగస్టు 31 వరకు మాత్రమే ఉంది.

బ్యాంకర్లు విజ్ఞప్తి చేశారు:
గతంలో దేశంలోని చాలా పెద్ద బ్యాంకర్లు ఈ సదుపాయాన్ని విస్తరించవద్దని విజ్ఞప్తి చేశాయి. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేఖ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ మాట్లాడుతూ ఈ సదుపాయాన్ని చాలా మంది ప్రజలు అన్యాయంగా ఉపయోగించుకుంటున్నారని, దీనిని ముందుకు తీసుకెళ్లకూడదని కోరాయి.