New Rule Online Gaming
New Rule Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming) ల పేరుతో బెట్టింగ్‌లు (Bettings) నిర్వహిస్తూ అమాయకుల సొమ్మును దోచుకుంటున్న కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం (Centre government) కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నిబంధనల (New Rule) ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (IT Minister Rajeev Chandrasekhar) వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్‌లో బెట్టింగ్ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేసిన కేంద్రం.. ఈ మేరకు ఐటీ నిబంధనలు -2021కి చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. బెట్టింగ్‌తో పాటు, యూజర్లకు హాని కలిగించే, వారి మానసిక స్థితిపై దుష్ప్రభవాలను చూపే ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించామని కేంద్ర మంత్రి తెలిపారు.
పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లను ఇప్పటికే నిషేధించాయి. ఇలాంటి చట్టాలకు తాజాగా నిబంధనలు అడ్డంకి కాబోవని కేంద్ర మంత్రి తెలిపారు. తాజా నిబంధనల్లో.. బెట్టింగ్ లేకుండా డబ్బులు చెల్లించి ఆడే ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా కేవైసీని తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కోసం కొత్త నిబంధలనుజారీ చేస్తున్నప్పుడు, ఆన్‌లైన్ గేమ్‌లను అనుమతించే ప్రమాణాలను నిర్ణయించడానికి కొత్తగా స్వీయ నియంత్రణ సంస్థ ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాకుండా భారత చట్టాలను ఉల్లంఘించే బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలను నిషేధించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
online rummy ఆడితే జైలుకే, బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం!
ఆన్‌లైన్ గేమింగ్స్ ఆమోదం పొందాలంటే మూడు స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్‌వో)లను నోటిఫై చేస్తాయి. ఎస్ఆర్‌వోలలో ఒక విద్యావంతుడు, సైకాలజిస్టు, బాలల కోసం పనిచేస్తున్న సంస్థకు చెందిన ఒక సభ్యుడు, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నుంచి ఒక ప్రతినిధి.. ఇలా పలు రంగాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారని కేంద్ర మంత్రి తెలిపారు. ఏదైనా ఆన్‌లైన్ గేమింగ్‌ను ఆమోదించాలా? వద్దా అనేది ఈ సంస్థలు నిర్ణయిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
Online Game Fraud : యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమింగ్.. రూ.2లక్షల అప్పు కట్టలేక సూసైడ్
ఆన్‌లైన్ గేమింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ స్వాగతించింది. గ్యాబ్లింగ్ ఫ్లాట్ ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా కొత్త నిబంధనలు ప్రోత్సహించగలవని అభిప్రాయపడింది.