Online Game Fraud : యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమింగ్.. రూ.2లక్షల అప్పు కట్టలేక సూసైడ్

ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి లాస్ అయిన యువకుడు గేమ్ సంస్థ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.

Online Game Fraud : యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమింగ్.. రూ.2లక్షల అప్పు కట్టలేక సూసైడ్

Online Game Fraud

Online Game Fraud : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి లాస్ అయిన యువకుడు గేమ్ సంస్థ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరానికి చెందిన లింగాల చెన్నకృష్ణ ఆన్ లైన్ గేమింగ్ సంస్థకు రూ.2లక్షలు బకాయి పడ్డాడు. బకాయిలు చెల్లించాలని ఆ సంస్థ వాళ్లు ఒత్తిడి చేశారు.

Cyber Criminals : గేమింగ్ లో 44 లక్షలు పోగొట్టిన బాలుడు

దీంతో కృష్ణ తల్లిదండ్రులు ఇప్పటివరకు రూ.లక్షా 60వేలు చెల్లించారు. మిగతా రూ.40వేలు కూడా చెల్లించాలని గేమ్ సంస్థ వాళ్లు యువకుడిని తీవ్రంగా వేధించారు. బకాయిలు చెల్లించలేక, టార్చర్ తట్టుకోలేకపోయిన కృష్ణ మరో దారి లేక సూసైడ్ చేసుకున్నాడు. కృష్ణ మృతితో అతడి ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

యువకుడి ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో

ఆన్ లైన్ గేమ్స్ ఫ్రాడ్స్ పై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, హెచ్చరికలు చేస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా ఆన్ లైన్ గేమ్స్ జోలికెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw