Cyber Criminals : గేమింగ్ లో 44 లక్షలు పోగొట్టిన బాలుడు

నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు లక్షలు, లక్ష 95వేలు, లక్ష 60వేలు, లక్ష 45వేలు, లక్ష25 వేలు, 50వేలు నాలుగు సార్లు ఫ్రీ ఫైర్ గేమింగ్ సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాలుని తాత అకౌంట్ లో ఉన్న 44 లక్షల రూపాయలు బాలుడు గేమింగ్ లో పెట్టాడు.

Cyber Criminals : గేమింగ్ లో 44 లక్షలు పోగొట్టిన బాలుడు

Free Fire Gaming (1)

Cyber Criminals : హైదరాబాద్ లో ఓ బాలుడు మొబైల్ లో ఫ్రీ ఫైర్ గేమింగ్ లో వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల రూపాయలు పోగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అంబర్ పేటకి చెందిన రిటైర్డ్ లేట్ పోలీస్ కూతురి కొడుకు (మనవడు) తాత మొబైల్ తీసుకొని మొబైల్ లో ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడు. ఫ్రీ ఫైర్ గేమ్ లో 1500 రూపాయలు పెట్టి ఆడాడు. మళ్ళీ 10 వేల చొప్పున 60 సార్లు నగదు పెట్టి ఆడాడు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు లక్షలు, లక్ష 95వేలు, లక్ష 60వేలు, లక్ష 45వేలు, లక్ష25 వేలు, 50వేలు నాలుగు సార్లు ఫ్రీ ఫైర్ గేమింగ్ సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాలుని తాత అకౌంట్ లో ఉన్న 44 లక్షల రూపాయలు బాలుడు గేమింగ్ లో పెట్టాడు.

Cyber Crime : సెల్ ఫోన్ హ్యాక్ చేసి రూ.25 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అవసర నిమిత్తం నగదును డ్రా చేద్దామని బ్యాంకుకు వెళ్లగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.