Covid Vaccination Guidelines: కొవిడ్ వ్యాక్సినేషన్‌పై కొత్త మార్గదర్శకాలు..

కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించింది. వ్యాక్సిన్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది.

Covid Vaccination Guidelines : కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 8) కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సినేషన్‌పై కొత్త మార్గదర్శకాలను కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త పాలసీ జూన్ 21 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలన్నింటికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపింది.

వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. WHO మార్గదర్శకాలు, ప్రపంచ ఉత్తమ పద్ధతుల అధ్యయనం ద్వారా వ్యాక్సినేషన్ పాలసీ రూపొందించారు. టీకా కార్యక్రమానికి భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. . వ్యాక్సిన్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75శాతం భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందుతాయి.

ప్రాధాన్యత ప్రకారం.. పౌరులందరికీ ఉచితంగా రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా టీకాలు అందజేస్తారు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా టీకాలు ఉచితంగా అందిస్తారు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు స్వంత ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించవచ్చు . కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మోతాదులను జనాభా, కరోనా కేసుల ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయింపులు ఉంటాయి.

వ్యాక్సిన్ డోసుల కేటాయింపు సమాచారాన్ని భారత ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. రాష్ట్రాలు, జిల్లాలు, టీకా కేంద్రాలకు ముందుగా డోసుల సమాచారాన్ని అందించాలి. వ్యాక్సిన్ డోసుల సమాచారాన్ని రాష్ట్రాలు,జిల్లాలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. ప్రైవేట్ ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు వారి నెలవారీ ఉత్పత్తిలో 25 శాతం కేటాయించవచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్‌ను రాష్ట్రాలు చూసుకోవాలి. పెద్ద, చిన్న ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య పంపిణీ సంతులనం చేయాలి.

ప్రైవేట్ ఆస్పత్రులు టీకా డోసుకు గరిష్టంగా 150 రూపాయల వరకు ఛార్జి చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలను పర్యవేక్షించాలి. పౌరులందరి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచితంగా టీకాలు అందించవచ్చు. నగదు చెల్లించే సామర్థ్యం ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రి టీకా కేంద్రాలు వినియోగించవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో,టీకా కేంద్రాల్లో వెనుకబడిన వర్గాల వారు వినియోగించే, బదిలీ చేయలేని ఎలక్ట్రానిక్ రిడీమ్ వోచర్లు అందిస్తారు. కొవిన్ ప్లాట్‌పామ్ ద్వారా ప్రతి పౌరుడు ప్రీ-బుకింగ్ ద్వారా వ్యాక్సిన్‌ను సులభంగా పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు