Online Betting Ads: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం… నిషేధం విధిస్తూ నిర్ణయం

ఇకపై డిజిటల్ మీడియా, వెబ్‌సైట్లతోపాటు, టీవీ ఛానెళ్లలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించవు. ఈ ప్రకటనల్ని ప్రసారం చేయకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Online Betting Ads: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు ప్రసారం చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని ప్రసారం చేయకూడదని సూచించింది. ఈ మేరకు డిజిటల్ మీడియా సంస్థలు, ఓటీటీలు, టీవీ ఛానెళ్లకు సోమవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

ఇప్పటికీ కొన్ని ఛానెళ్లు, మీడియా, ఆన్‌లైన్‌ సంస్థలు వీటిని ప్రసారం చేయడం తాము గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఇకపై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయకుండా నియంత్రణ పాటించాలని సూచించింది. కొన్ని ఆన్‌లైన్‌ బెట్టింగ్ సంస్థలు తమ ప్రచారం కోసం న్యూస్ వెబ్‌సైట్లను వాడుకుంటున్నాయని, ఈ ప్రకటనలపై నిషేధం విధిస్తున్నామని కేంద్రం చెప్పింది. ‘‘బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌పై దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం ఉంది.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో మరో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి

కానీ, ఈ సంస్థలు తమ గేమ్స్‌ను ప్రొఫెషనల్ క్రీడల్లాగా ప్రకటించుకుంటున్నాయి. న్యూస్ వెబ్‌సైట్లు, ఛానెళ్లను ఈ సంస్థలు తమ ప్రకటనల కోసం వాడుకుంటున్నాయి. ఇకపై వీటిని ప్రసారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని కేంద్రం హెచ్చరించింది.

 

ట్రెండింగ్ వార్తలు