Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడిని హత్య చేశారు ఇద్దరు దుండగులు. తనను శివుడు కలలో నరబలి కోరినట్లు, అందుకే బాలుడిని చంపినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

Human Sacrifice: ఆధునిక యుగంలోనూ మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మూఢ నమ్మకాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు నరబలికి యత్నిస్తూ, సాటి మనిషి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నరబలి జరిగింది.

Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

దక్షిణ ఢిల్లీ పరిధిలోని లోధి కాలనీలో నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడిని చంపేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. విజయ్ అనే వ్యక్తి శనివారం రాత్రిపూట గంజాయి సేవించాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఒక శివాలయానికి వెళ్లాడు. అక్కడ చాలా మంది భజనలు, పూజలు చేస్తున్నారు. అక్కడ తాను కూడా పూజలు చేస్తానని, ధూపం ఇవ్వమని అడిగారు. కానీ, వాళ్లు దీనికి నిరాకరించారు. అనంతరం అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్న విజయ్ తనను శివుడు నర బలికోరుతున్నట్లు భ్రమపడ్డాడు. వెంటనే శివుడు కోరినట్లుగా నరబలి ఇచ్చేందుకు సిద్ధపడ్డ విజయ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఒంటరిగా కనిపించిన ఆరేళ్ల బాలుడిని అపహరించుకుని వెళ్లిపోయాడు. సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక బిల్డింగులోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి గొంతు, మెడ కోసి హత్య చేశాడు.

Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్

ఈ ఘటనలో విజయ్‌కు మరో వ్యక్తి కూడా సహకరించాడు. కాగా, ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత తమ బాబు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడి ఇంటివద్ద రక్తపు మరకల్ని గుర్తించారు. అప్పుడు ఆరాతీయగా ఈ దారుణం వెలుగుచూసింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.