Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. యాత్ర సందర్భంగా సోమవారం ఆయన ఒకే రోజులో మఠం, మసీదు, చర్చి సందర్శించారు.

Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో అసాధారణ పని చేశారు. ఒక్కరోజులోనే మఠం, చర్చి, మసీదును సందర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

Rahul and Pawar: వర్షంలో తడుస్తూ రాహుల్ చేసిన ప్రసంగాన్ని శరద్ పవార్‭ ర్యాలీతో పోల్చిన ఎన్సీపీ

అక్కడ మైసూరులో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. యాత్ర 26వ రోజు సందర్భంగా సోమవారం ఆయన మఠం, చర్చి, మసీదును సందర్శించారు. మైసూరులోని సుట్టూర్ మఠానికి వెళ్లిన రాహుల్ అక్కడ శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామీజీని కలిశారు. ఆయనతో కొద్దిసేపు చర్చించి, స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మైసూరులోని మజీద్-ఇ-ఆజంను సందర్శించారు. అక్కడ్నుంచి ప్రయాణం ప్రారంభించిన రాహుల్ తర్వాత సెయింట్ ఫిలోమెనా చర్చి సందర్శించారు. అక్కడ పలువురు చర్చి మదర్స్‌తో ఆయన మాట్లాడారు.

Munugodu bypoll schedule: నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

అనంతరం ఖాదీ గ్రామోద్యోగ్‌లో పనిచేసే నేత కార్మికులైన మహిళలను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలో ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటించబోతున్నారు. వచ్చే గురువారం ఆమె ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటారు.