Munugodu bypoll schedule: నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికను నవంబర్‌ 3న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14 వరకు గడువు ఉంటుందని వివరించింది. నవంబర్‌ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.

Munugodu bypoll schedule: నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

Munugode bypoll schedule

Munugodu bypoll schedule: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికను నవంబరు 3న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14 వరకు గడువు ఉంటుందని వివరించింది. నవంబర్‌ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు ఉపఎన్నికపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే అంచనాతో ఈ ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మునుగోడులో గెలిచిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడం కోసమేనని ఆయన రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ఆ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

దేశంలో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

మునుగోడు సహా దేశంలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలూ నవంబరు 3నే జరగనున్నాయి. వాటి ఫలితాలను నవంబరు 6న వెల్లడిస్తారు.

 

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..