Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో మరో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి

అఫ్ఘనిస్తాన్‌లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో మరో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి

Afghanistan: అఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఈ ఘటన అఫ్ఘనిస్తాన్ రాజధాని, కాబూల్ పశ్చిమ ప్రాంతమైన షాహిద్ మజారి రోడ్, పుల్-ఇ-సుక్తా ప్రాంతంలో సోమవారం జరిగింది.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

స్థానికంగా ఉన్న ఒక ఎడ్యుకేషన్ సెంటర్లోని, క్లాస్‌రూమ్‌లో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 53 మంది మరణించారు. వీరిలో 46 మంది బాలికలుకాగా, మిగతా మహిళలు ఉన్నారు. ఘటన సమాచారం అందుకున్న అక్కడి భద్రతాదళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, గత నెల 30న కూడా కాబూల్‍‌లోని ఒక విద్యాసంస్థపై జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 43 మంది మరణించారు.

భారీ సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా అమ్మాయిలే కావడం గమనార్హం.