ఉల్లి ఘాటు : ఒక్కరోజులో రూ.30 పెరిగింది 

  • Publish Date - November 5, 2019 / 10:02 AM IST

ఉల్లిపాయ ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయను కట్‌ చేయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయలను కొనలేకపోతున్నాం..కొనకుండా ఉంటలేకపోతున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలేని కూర ఉండదు కాబట్టి. అందుకే ఎంత రేటు ఉన్నా కొనక తప్పదు. 

దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో  రూ. 50 నుంచి 70 మధ్య అమ్ముతున్నారు.  ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కిలో ఉల్లి ధర రూ. 80 పలికిన విషయం తెలిసిందే. కానీ తరువాత ఎక్కువగా కాకపోయినా కొద్దిగా దిగి వచ్చింది. కానీ మళ్లీ ఉల్లి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఛండీఘర్ లో కిలో ఉల్లిపాయలు ఒక్కరోజులోనే రూ.30లు పెరిగి షాక్ ఇచ్చింది. సోమవారం (నవంబర్ 4)రూ.50 నుంచి ఒక్కసారిగా పెరిగిపోయి మంగళవారానికి  రూ.80 కి పెరిగింది.  మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్‌ పెరిగింది.

మహారాష్ట్రలో వర్షాలు మళ్లీ మళ్లీ కురుస్తున్నాయి. దీంతో ఉల్లిపంటలను భారీ నష్టం ఏర్పడుతుండటంతో మళ్లీ ఉల్లి ధరలు పైపైకి వెళ్తున్నాయి. భారత్ లో డిమాండ్ ల మేరకు కిలో రూ.100 కూడా అమ్మిన పరిస్థితులున్నాయి.