దేశం ఓ మేధావిని కోల్పోయింది

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

  • Publish Date - August 25, 2019 / 06:34 AM IST

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కైలాష్‌ నగర్‌లోని జైట్లీ నివాసంలో… ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జైట్లీతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. జైట్లీ మృతితో దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని చెప్పారు.

కైలాష్‌ నగర్‌లోని జైట్లీ నివాసానికి నేతలు తరలి వస్తున్నారు. ఆయన పార్థివవదేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత మోతీలాల్‌ వోరా, ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌ సింగ్‌ సైతం జైట్లీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం కైలాష్‌ నగర్‌లోని జైట్లీ నివాసం నుంచి పార్థివ దేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.