Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య

వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.

  • Updated on- July 5, 2022 / 06:08 PM IST

Chandrashekhar Guruji

Chandrashekhar Guruji : కర్నాటక హుబ్లీలో దారుణం జరిగింది. వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రశేఖర్ గురూజీని ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తాము చంద్రశేఖర్ శిష్యులుగా చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు సిబ్బందిని నమ్మించి లోపలికి వచ్చారు. చంద్రశేఖర్ రూమ్ నుంచి బయటకు రాగానే ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆ వెంటనే ఈ దారుణానికి పాల్పడ్డారు. చంద్రశేఖర్ కు వాస్తు సిద్ధాంతిగా మంచి పేరుంది. సరళ వాస్తు పేరుతో కొన్ని వందల ఉపనాస్యాలు ఇచ్చారు. 2వేల సెమినార్లలో పాల్గొన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన మాటకు విలువ ఇచ్చేవారు.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

అయితే ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. గతంలో ఆయన ఓ ప్రైవేట్ సంస్థను నెలకొల్పారు. దానికి సంబంధించి జీతాల వివాదం ఒకటి ఉంది. హత్యకు అదే కారణమా? లేక మరో కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Marriage Cheating : మేకప్‌తో యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లికూతురు

ఇద్దరు నిందితులను బాగల్ కోట్ కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య తర్వాత వారు పరార్ అయ్యారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమం కోసం చంద్రశేఖర్ గురూజీ హుబ్లీకి వచ్చారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి దారుణ హత్య సంచలనం రేపుతోంది. గురూజీ  హత్య కుటుంబసభ్యులను. శిష్యులను, సన్నిహితులను షాక్ కి గురి చేసింది.