Marriage Cheating : మేకప్‌తో యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లికూతురు

విడాకులు తీసుకున్న వారు, లేటు వయస్సు పెళ్లి కొడుకులే ఆమె టార్గెట్. మ్యారేజి బ్రోకర్లను సంప్రదించి వారి ద్వారా అలాంటి వారిని సంప్రదించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆతర్వాత వారి ఆస్తులను కాజేయటం ఆమె పనిగా పెట్టుకుందని మూడో భర్త ఆరోపించాడు.

Marriage Cheating : మేకప్‌తో యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లికూతురు
ad

Marriage Cheating :  మేకప్ వేస్తే వయస్సు ఎంతగా తగ్గపోతుందో ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆధునిక కాలంలో చాలా మంది మేకప్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఫిఫ్టీ ప్లస్ లో మేకప్ వేయించుకుని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్లికూతురు కటకటాల్లోకి వెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరులో చోటు చేసుకుంది. విడాకులు తీసుకున్న వారు, లేటు వయస్సు పెళ్లి కొడుకులే ఆమె టార్గెట్. మ్యారేజి బ్రోకర్లను సంప్రదించి వారి ద్వారా అలాంటి వారిని సంప్రదించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆతర్వాత వారి ఆస్తులను కాజేయటం ఆమె పనిగా పెట్టుకుందని మూడో భర్త ఆరోపించాడు. 54 ఏళ్ల వయస్సులోనూ బ్యూటీ పార్లర్ కు వెళుతూ యువకులను మోసం చేస్తోంది ఈ కిలాడీ లేడీ.

వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుదుప్పేటలో ఇంద్రాణి(65) అనే మహిళ తన కుమారుడు హరితో నివసిస్తోంది. హరి ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతనికి వివాహం అయి విడాకులు తీసుకున్నాడు. అతనికి తిరిగి పెళ్లి చేసే ప్రయత్నంలో ఇంద్రాణి ఆరేళ్లుగా ప్రయత్నం చేస్తోంది. 2021లో తిరుపతి జిల్లా పూత్తూరుకు చెందిన శరణ్య అనే మహిళ ఒక పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా పరిచయం అయ్యింది. తనది నిరుపేద కుటుంబం అని చెప్పింది.

అయితే  తాము చూడటానికి వస్తున్నామని ఇంద్రాణి… శరణ్యకు చెప్పింది. వారు వచ్చే సరికి శరణ్య బ్యూటీపార్లర్‌కు వెళ్లి జుట్టు సరి చేయించుకుని, ఫేషియల్ చేయించుకుని అందంగా తయారయ్యింది. శరణ్యను చూసిన పెళ్ళి కొడుకు హరి ఆమె నచ్చిందని చెప్పాడు. దీంతో ఇంద్రాణి తన కొడుక్కి శరణ్యనిచ్చి సొంత ఖర్చులతో పెళ్లి చేసింది. పెళ్ళిలో శరణ్యకు 25 సవర్ల బంగారం బహుమతిగా ఇచ్చింది.
పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన శరణ్య అత్త ఇంద్రాణి, భర్త హరితో గొడవకు దిగింది. భర్త నెలవారీ ఆదాయం తనకే ఇవ్వాలని… బీరువా తాళాలు ఇవ్వాలని తరచూ గొడువపడేది.

అత్తపేరు మీద ఉన్న ఆస్తులను తన పేరు మీద రాయాలని వేధించేది. ఈ క్రమంలో అత్త ఇంద్రాణి, కోడలు శరణ్యను పుట్టింటికి పంపించింది. ఆస్తులు మార్పులు చేసేందుకు శరణ్య ఆధార్ కార్డు అడిగాడు భర్త హరి. ఆస్తి వస్తోంది అనే సరికి శరణ్య తన ఆధార్ కార్డు భర్త హరికి ఇచ్చింది. అందులో భర్త అని ఉన్న చోట రవి అని ఉండటంతో తల్లి కుమారులకు అనుమానం వచ్చింది. దీంతో శరణ్యకు తెలియకుండా హరి ఆమె గురించి ఎంక్వైరీ చేసాడు.  ఆమె గుట్టు తెలిసి షాక్ కు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పుత్తూరు పోలీసులు శరణ్యను అదుపులోకి తీసుకుని పుత్తూరు జైలుకు తరలించారు.

పుత్తూరుకి చెందిన శరణ్య అలియాస్ సుకన్య  అలియాస్  సంధ్య కి అదే ప్రాంతానికి చెందిన రవితో ఇంతకు ముందే వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భర్త రవితో విభేదాల కారణంగా సుకన్య భర్త నుంచి విడిపోయింది. భర్త రవి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. భర్త నుంచి విడిపోయిన సుకన్య తన తల్లితో కలిసి జీవిస్తోంది. సుకన్య భర్త రవి నుంచి విడిపోయిన తరువాత ఆర్థికంగా ఇబ్బంది పడేది. దీంతో సుకన్య రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

కొంతమంది పెళ్లిళ్ల బ్రోకర్ల సహాయంతో సుకన్య జొల్లార్ పేటకు చెందిన రైల్వే ఫుడ్ కాంట్రాక్టర్ సుబ్రమణికి సంధ్యగా పరిచయం చేసుకుని,  అతనితో  కొన్నేళ్లు కాపురం చేసింది. ఆ తరువాత  కరోనా కాలంలో తన తల్లిని చూడటానికి వెళ్తున్నానని చెప్పి ఆమె  పుత్తూరు ఇంటికి తిరిగి వచ్చింది. సుకన్య, సంధ్య, శరణ్య ఇలా పలు పేర్లు వాడుకుని విడాకులు తీసుకున్న వాళ్లను మళ్లీ పెళ్లాడి మోసాలకు పాల్పడేది.

తాజాగా పెళ్ళిళ్ల బ్రోకర్ల సహయంతో ఇంద్రాణి కుమారుడు సంబధం వచ్చింది శరణ్యకు. అతనికి ఆస్తి పాస్తులు ఉన్నాయన్న సంగతి తెలుసుకుని అతనికి నచ్చేట్టు అందంగా మేకప్ చేయించుకుని పెళ్ళి చూపుల్లో పాల్గోని హరిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న  హరి పోలీసులకు వివరాలు అందచేశాడు. విడాకులు తీసుకున్న వారి నుంచి ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్న కిలాడీ లేడీ శరణ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను రిమాండ్ కు తరలించారు.

తన భార్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తనకు తెలియదని పోలీసు స్టేషన్ కు వెళ్తే భార్య లీలలు బయటపడ్డాయని రెండో భర్త సుబ్రమణి అంటున్నారు. అలాగే మోసం చేసిన మహిళ తన మొదటి భర్త రవిపై ఏపీలో వరకట్న కేసు పెట్టి రూ.10 లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది.

Also Read : Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ