Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ

ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు.

Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ

Hyderbad Murde Case

Honour Killing :  ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆదృశ్యమై,  శవమై తేలిన నారాయణ రెడ్డి హత్యకు అతని మామ కందుల వెంకటేశ్వర రెడ్డి రూ.4.50 లక్షలు సుపారీ ఇచ్చినట్లు తేలింది. ఒకే సామాజికవర్గమైనా తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవటం భరించలేని వెంకటేశ్వర రెడ్డి సుపారీ ఇచ్చి అల్లుడిని హత్యచేయించినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

ప్రకాశం జిల్లా రాజువారిపాలెంకు చెందిన నారాయణ రెడ్డి(25) హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన వెంకటేశ్వర రెడ్డి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి వాళ్లిద్దరూ ఢిల్లీ వెళ్లి తలదాచుకున్నారు. కూతురు అల్లుడి ఆచూకి తెలుసుకున్న వెంకటేశ్వర రెడ్డి ఘనంగా పెళ్లి చేస్తానని మాయ మాటలు చెప్పి వారిని ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం తన కుమార్తెను గృహంలో బంధించాడు. తిరిగి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు.

అయినా ఆమె వాటిని తిరస్కరించటం మొదలెట్టింది. కూతురు ప్రవర్తనతో కోపం తెచ్చుకున్న వెంకటేశ్వర రెడ్డి అల్లుడు నారాయణ రెడ్డిని చంపాలని ప్లాన్ వేశాడు.  ఇందుక తమ బంధువైన శ్రీనివాస రెడ్డిని ఆశ్రయించాడు. శ్రీనివాస రెడ్డి అందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసాడు. చివరికి రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. శ్రీనివాస రెడ్డి హైదరాహాద్ దిల్ సుఖ్ నగర్ లో ఐస్ క్రీమ్ పార్లర్ లో పని చేస్తున్నాడు.
ఇద్దిర మధ్య ఒప్పందం కుదరటంతో శ్రీనివాసరెడ్డి గత నెల 24 న గిద్దలూరు వెళ్ళాడు. అక్కడ ఆశిక్ అనే వ్యక్తిని తీసుకుని కర్నూలు వెళ్ళాడు. అక్కడ అద్దెకు తీసుకున్న కారులో మరో వ్యక్తి కాశీని తీసుకుని 25వ తేదీన హైదరాబాద్ చేరుకున్నారు.

షేక్ పేట లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడే నారాయణ రెడ్డి హత్యకు పధక రచన చేసినట్లు సమాచారం. జూన్ 27న నారాయణ రెడ్డిని కారులో బయటకు తీసుకువెళ్లి మెడకు టవల్ ను ఉచ్చుగా చుట్టి హత్య చేశారు. అదే కారులో జిన్నారం శివారు అటవీ ప్రాంతంలోకి మృతదేహాన్ని తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి తగులబెట్టారు. నారాయణ రెడ్డిని చంపేశానని శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ నుంచి ముగ్గురు కలిసి కర్నూలు వెళ్లారు. అక్కడి నుంచి శ్రీనివాస రెడ్డి వెంకటేశ్వరరెడ్డి కిఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాడు. నెల తర్వాత ఇస్తానని చెప్పటంతో ఎవరికి వారు విడిపోయి వెళ్లిపోయారు. ఆశిక్ హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో బంధువులు ఇంట్లో తలదాచుకున్నాడు. శ్రీనివాస రెడ్డి కాశీ, చిత్తూరు నెల్లూరు జిల్లాలలో తిరుగుతున్నట్లు గుర్తించారు.

నారాయణరెడ్డి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నారాయణ రెడ్డి కాల్ డేటా ఆధారంగా ఆశిక్ ఆచూకి లభించింది. ఆశిక్ ను అదుపులోకి తీసుకోవటంతో సుపారీ విషయం, పరువు హత్య బయటకు వచ్చింది. జిన్నారంలోని అటవీ ప్రాంతంలో జులై 2వ తేదీన నారాయణ రెడ్డిని తగుల బెట్టిన ప్రాంతంలో పోలీసులు పరిశీలించగా ఎడమకాలు దూరంగా పడి ఉంది. కేవలం ఎముకలే కనిపించాయి. శవ పరీక్షఅనంతరం వాటిని కుటుంబ సభ్యులకు అందచేశారు.

Also Read : Narendra Modi : ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు-ఐదుగురు అరెస్ట్