Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్‌తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

Cab Driver

Cab Driver: క్యాబ్ డ్రైవర్‌కు, ప్యాసింజర్‌కు మధ్య తలెత్తిన వాగ్వాదం ప్యాసింజర్ హత్యకు దారి తీసింది. క్యాబ్ డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్యాసింజర్‌ మరణించాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఉమేందర్, తన భార్య పిల్లలతో కలిసి ఆదివారం బయటకు వెళ్లాడు.

SpiceJet Flight: కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం

మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్‌తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ పిల్లలపై అరిచాడు. కారులోంచి దిగిపొమ్మని పిల్లల్ని హెచ్చరించాడు. వెంటనే ఉమేందర్, దీనిపై డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం తలెత్తింది. చివరకు పెద్ద గొడవకు దారి తీసింది. డ్రైవర్ రవి, ప్యాసింజర్ తలపై ఫోన్‌తో కొట్టాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఉమేందర్ అక్కడే కుప్పకూలిపోయాడు.

Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం: సోము వీర్రాజు

ఈ ఘటన జరుగుతున్నప్పడు ఉమేందర్ భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. వెంటనే ఉమేందర్ భార్య, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడ్ని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ఉమేందర్ మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రవిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.