Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం: సోము వీర్రాజు

యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపడతారు. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కార్యక్రమం కాదు. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందనే మేము భావిస్తున్నాం.

Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం: సోము వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju: తెలంగాణతోపాటు, ఏపీలో కూడా అధికారం సాధించే దిశగా అడుగులేస్తామని చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆగష్టు 2 నుంచి 15 వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం‌మన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తాం అని చెప్పారు. అన్ని వర్గాల వారికి నేనున్నా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు జగన్ తీరు వల్ల అందరూ నష్ట పోయారు.

Y.S.JAGAN: పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక: సీఎం జగన్

యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపడతారు. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కార్యక్రమం కాదు. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందనే మేము భావిస్తున్నాం. ప్రధాని పర్యటనలో‌ నల్ల బెలూన్లు ఎగురవేయడం సరైన విధానం కాదు. మోదీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి, రాజకీయాలకు సంబంధం లేదు. ఆదివాసీల గురించి మాత్రమే మోదీ మాట్లాడారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో‌ చూడటం సరి కాదు. కొంతమంది సడన్‌గా పుట్టుకొచ్చి మేధావులుగా మాట్లాడతారు. అటువంటి వారి మాటలను మేము పట్టించుకోం. ‘సబ్ కా సాత్, సబ్ కా‌ వికాస్’ అనేది మోదీ మంత్రం. ఏపీలో కొంతమందికి అధికారమే కావాలి. అభివృద్ధి అక్కర్లేదు. కానీ, బీజేపీకి అభివృద్ధి కావాలి. ఏపీలో బీజేపీ‌ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది.

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు

రాష్ట్రంలో రెండో‌ కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పేదల పక్షాన బీజేపీ ఉద్యమం‌ చేస్తుంది. విద్య, వైద్యానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది.  కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యత యువకులకు అప్పగిస్తాం. మొక్కలు పెంచి..‌ వాటిని సంరక్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తాం. తెలంగాణ, ఏపీలలో‌ బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తాం. జాతీయ సమావేశాలలో కూడా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాం. బీజేపీ యువ మోర్చా ద్వారా యాత్రకు శ్రీకారం చుట్టాం’’ అని చెప్పుకొచ్చారు సోము వీర్రాజు.