Y.S.JAGAN: పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక: సీఎం జగన్

నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ ఇంగ్లీష్ నేర్చుకునేలా చేశా.

Y.S.JAGAN: పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక: సీఎం జగన్

Y.s.jagan

Y.S.JAGAN: మూడేళ్లుగా ఎక్కడా తగ్గకుండా జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు, పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ పథకం కింద కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు

‘‘నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ ఇంగ్లీష్ నేర్చుకునేలా చేశా. బైజూస్ వారితో ఒప్పందం కుదుర్చుకుని ప్రతి విద్యార్థి ఆన్‌లైన్ ద్వారా చదివేలా చేస్తున్నా. రేపటి తరం గురించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మాది. 2020-21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కిట్లలో ఒక్కో కిట్టు కోసం రూ.1,500 ఖర్చు చేశాం.

Telangana : డ్రెస్సింగ్ బాగాలేదంటూ..విద్యార్ధి తల గోడకేసి కొట్టిన లెక్చరర్

2022-23లో ఒక్కో కిట్టుకు దాదాపు రూ.2,000 వరకు ఖర్చు చేస్తున్నాం. ఈ ఏడాది 8వ తరగతి స్టూడెంట్స్ కోసం ట్యాబ్‌లు అందజేయబోతున్నాం. దీని కోసమే బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. వసతి దీవెన కింద రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా మీ మేనమామ ప్రభుత్వం ఈ ఏడాది బైజూస్‌తో ఒప్పందం ద్వారా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆదోనికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నా’’ అని సభలో జగన్ ప్రసంగించారు.