Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు

సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారు? నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఆమె ఏం చేస్తున్నారు.

Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు

Teegala Krishna Reddy

Updated On : July 5, 2022 / 3:29 PM IST

Teegala Krishna Reddy: తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు చేశారు. 10 టీవీతో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారు? నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఆమె ఏం చేస్తున్నారు. పార్టీని కాపాడాల్సిన బాధ్యత మంత్రిపై లేదా? కేసీఆర్ పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నా.

Telangana : డ్రెస్సింగ్ బాగాలేదంటూ..విద్యార్ధి తల గోడకేసి కొట్టిన లెక్చరర్

నేనేమీ చిన్న మనిషిని కాదు. మేయర్‌గా, ఎమ్మెల్యేగా అన్ని పదవుల్లో పనిచేశాను. నేను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు. సబితకు సూచనలు చేస్తున్నా. నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలు జరుగుతున్నాయి. సబితకు తెలిసి జరుగుతున్నాయో? తెలియక జరుగుతున్నాయో నాకు తెలియదు. ఇక్కడి పరిస్థితులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాను’’ అని తీగల వ్యాఖ్యానించారు.