Chandrayaan-3: విజయవంతంగా దూసుకెళ్తున్న చంద్రయాన్ -3.. అసలు టార్గెట్ ఇప్పుడు మొదలైంది ..

చంద్రయాన్ -3 ప్రయోగం ప్రారంభం నాటినుండి ఒక్కో దశను దాటుకుంటూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఐదు దశలను పూర్తిచేసుకున్న చంద్రయాన్ వ్యోమనౌక ఆరో దశ అయిన చంద్రుని కక్ష్యంలోకి ప్రవేశించింది.

Chandrayaan-3

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతంగా లక్ష్యం వైపుకు దూసుకెళ్తోంది. గత నెల 14న మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లి 18 రోజులు అవుతుంది. ఈ సమయంలో భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసుకుంది. ఇప్పడే అసలు ప్రయోగం ప్రారంభమైంది. తాజాగా చంద్రుడి కక్ష్య వైపు దూసుకెళ్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3 కక్ష్యను పెంచి ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

Chandrayaan-3 Launch: నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్-3ని విమానంలోనుంచి చూశారా..? వీడియో వైరల్

బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్కింగ్ కేంద్రం (ఐఎస్టీఆర్ఏసీ)లో పెరీజి – ఫైరింగ్ దశ పూర్తయింది. చంద్రయాన్ -3ని ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇక తదుపరి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమేనని ఇస్రో పేర్కొంది. అయితే, ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విషయంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

Chandrayaan-3: భారతీయుల ఆశల్ని నింగిలోకి మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. చంద్రయాన్-3 సక్సెస్!

చంద్రయాన్ -3 ప్రయోగం ప్రారంభం నాటినుండి ఒక్కో దశను దాటుకుంటూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఐదు దశలను పూర్తిచేసుకున్న చంద్రయాన్ వ్యోమనౌక ఆరో దశ అయిన చంద్రుని కక్ష్యంలోకి ప్రవేశించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తిచేసి చంద్రునివైపు వెళ్తున్నదని ఇస్రో పేర్కొంది.