CAA సెగలు :  హీరో సిధ్ధార్ధపై కేసు నమోదు 

  • Publish Date - December 20, 2019 / 11:04 AM IST

దేశవ్యాప్తంగా  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి.  దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు.   చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై  చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరిలో  ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్  ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది. కాగా…రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సహా 38 గ్రూపుల నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికి, ఆందోళన చేపట్టినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.  ఆందోళనలో పాల్గోన్న  నిరసనకారులపై 144 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు ఢిల్లీలో  పౌరతసత్వ  సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. భీం ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీద్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జమా మసీదు వద్ద ఉద్రిక్తపరిస్ధితులు  నెలకొన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షెహర్ లో ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు.