Chennai Rains : చెన్నైలో భారీవర్షాలు.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జాం

చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తమిళనాడులో రెండు రోజుల క్రితం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Chennai Rains : చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తమిళనాడులో రెండు రోజుల క్రితం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాబోయే కొద్దిగంటల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నైలో కురిసిన భారీ వర్షం కారణంగా సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల నగరంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ వర్షపునీరుతో జలమయమయ్యాయి. మరోవైపు మెట్రో పనులు కూడా జరుగుతుండటంతో వడపళనిలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. అటుగా వెళ్లే వాహనదారులు రోడ్డు దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగ్మూర్, సెంట్రల్, పురసైవాక్కం, గిండి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపించాయి.

బంగాళాఖాతంలో తూర్పు వైపు దిశగా గాలులు దూసుకుస్తున్నాయి. తీరం వెంబడి నగరాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read Also : Cyberabad Police : డిసెంబర్ 31..క్యాబ్ డ్రైవర్లు రైడ్‌‌కు నిరాకరించారా..ఫిర్యాదు చేయొచ్చు..వాట్సాప్ నెంబర్ ఇదే

ట్రెండింగ్ వార్తలు