Cyberabad Police : డిసెంబర్ 31..క్యాబ్ డ్రైవర్లు రైడ్‌‌కు నిరాకరించారా..ఫిర్యాదు చేయొచ్చు..వాట్సాప్ నెంబర్ ఇదే

విధుల్లో ఉన్న సమయంలో తప్పకుండా యూనిఫాం ధరించాల్సి ఉంటుందని...ఒకవేళ క్యాబ్ డ్రైవర్లు రైడ్ కు నో అంటే..ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని...వాట్సాప్ నెంబర్...

Cyberabad Police : డిసెంబర్ 31..క్యాబ్ డ్రైవర్లు రైడ్‌‌కు నిరాకరించారా..ఫిర్యాదు చేయొచ్చు..వాట్సాప్ నెంబర్ ఇదే

New Year

Updated On : December 30, 2021 / 7:33 PM IST

Restrictions Cab And Auto Drivers : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించారు. మందు తాగి రోడ్ల మీదకు వస్తే..తాట తీస్తామని, పీఎస్ లో హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాల్సి వస్తుందని ఒకింత ఘాటుగానే చెబుతున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలో పలు ఆంక్షలు విధించారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలు తప్ప…మిగతా వాహనాలకు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 01వ తేదీ ఉదయం 5 గంటలకు వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్స్ మూసివేయనున్నారు.

Read More : AP Covid – 19 : ఏపీలో కరోనా..130 కొత్త కేసులు..ఒకరి మృతి

ఈ సందర్భంగా…క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. వీరు విధుల్లో ఉన్న సమయంలో తప్పకుండా యూనిఫాం ధరించాల్సి ఉంటుందని, వాహన డ్యాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఒకవేళ క్యాబ్ డ్రైవర్లు రైడ్ కు నో అంటే..ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని…వాట్సాప్ నెంబర్ 9490617346కు కంప్లైట్ చేయాలన్నారు. 7:10 PM 12/30/2021ఫిర్యాదులు వస్తే..క్యాబ్, ఆటో డ్రైవర్లకు జరిమాన విధిస్తామని టీఎస్ పోలీసులు హెచ్చరించారు. ప్రజల వద్ద అధిక డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు.

Read More : TTD : జనవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు..వివరాలు..ఏమేం ఉన్నాయంటే

ఇక పబ్ లో తాగి బయటకు వచ్చి వాహనం నడుపకుండా చూసే బాధ్యత పబ్, బార్లదేనని..ఇందుకు డ్రైవర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని..నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10,000 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. రెండోసారి పట్టుబడిన వారికి రూ. 15, 000 జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష, మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనం నడపకూడదని, రూల్స్ ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 183, 184 కింద కేసు నమోదు చేస్తామన్నారు.