TTD : జనవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు..వివరాలు..ఏమేం ఉన్నాయంటే

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2022, జనవరి నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది...

TTD : జనవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు..వివరాలు..ఏమేం ఉన్నాయంటే

Ttd Properties Releases White Paper

Updated On : December 30, 2021 / 6:10 PM IST

Special festivals TTD : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2022, జనవరి నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది. మొత్తం పది విశేష ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించింది. తొలుత జనవరి 02వ తేదీన అధ్యయనోత్సవాలతో ప్రారంభం కానున్నాయి. జనవరి 13వ తేదనీ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. శ్రీవారి సన్నిధిలో రాపత్తు, జనవరి 14వ తేదనీ వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి..భోగి పండుగ‌ను నిర్వహిస్తారు. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి, జనవరి 16న శ్రీ గోదా పరిణయోత్సవంతో పాటు.. శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఇక జనవరి 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి, జనవరి 18వ తేదీన శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వాన్ని చేయనున్నారు. జనవరి 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు జరుగనుంది. జనవరి  26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, జనవరి 27న శ్రీవారి తిరుమలనంబి సన్నిధికి వేంచేపు ఉండనుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13, 14 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నేపథ్యంలో జనవరి 11 నుండి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జనవరి 11 నుండి 14 వరకు కరెంట్ బుకింగ్ ద్వారానే గదుల కేటాయింపు ఉంటుందని తెలిపింది.