AP Covid – 19 : ఏపీలో కరోనా..130 కొత్త కేసులు..ఒకరి మృతి

విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 33 వేల 188 శాంపిల్స్ పరీక్షించగా…130 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.

AP Covid – 19 : ఏపీలో కరోనా..130 కొత్త కేసులు..ఒకరి మృతి

Andhra pradesh

Andhra Pradesh Covid 19 : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో తక్కువ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ కరోనాతో పాటు..కొత్త వేరియంట్ జిల్లాలకు వ్యాపిస్తోంది. బుధవారం వరకు ఏపీలో 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తోంది.

Read More : Android Update: త్వరలో ఈ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్

ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 130 మందికి కరోనా సోకింది. నెల్లూరులో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,084 పాజిటివ్ కేసులకు గాను…20,58,510 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,493 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,081గా ఉందని తెలిపింది.

Read More : AP PRC Issue : పీఆర్సీ అంశం తేలేనా…అసంపూర్తిగా చర్చలు

విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 33 వేల 188 శాంపిల్స్ పరీక్షించగా…130 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 97 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,12,95,287 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 07. చిత్తూరు 18. ఈస్ట్ గోదావరి 14. గుంటూరు 07. వైఎస్ఆర్ కడప 07. కృష్ణా 18. కర్నూలు 02. నెల్లూరు 06. ప్రకాశం 05. శ్రీకాకుళం 05. విశాఖపట్టణం 30. విజయనగరం 03. వెస్ట్ గోదావరి 08. మొత్తం : 130