Android Update: త్వరలో ఈ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్

ఆండ్రాయిడ్ 12 అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నిరీక్షణకు తెరపడనుంది. శాంసంగ్, అసూస్ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్

Android Update: త్వరలో ఈ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్

Phones

Android Update: ఆండ్రాయిడ్ 12 అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నిరీక్షణకు తెరపడనుంది. శాంసంగ్, అసూస్ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అందించడం ప్రారంభించాయి. డిసెంబర్ 27 నుంచి వివిధ దేశాల్లో దశల వారీగా ప్రారంభమైన ఈ అప్డేట్ త్వరలో భారత్ వినియోగదారులకు అందనుంది. శాంసంగ్ లోని S21 సిరిస్, Z సిరీస్ ఫోన్ లకు One UI 4 ఆధారిత Android 12 అప్డేట్ రాగా, 2020లో వచ్చిన మరికొన్ని ఫ్లాగ్ షిప్ ఫోన్ లకు త్వరలో OS అప్డేట్ రానుంది.

శాంసంగ్ లోని Galaxy S20 సిరీస్, S20FE, Galaxy Note20 సిరీస్, ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్ రానుంది. ఇప్పటికే యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ అప్డేట్ అవగా, ఆసియా దేశాలకు అతిత్వరలోనే OS అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ లోని S10 సిరీస్ అయిన S10e, S10, S10+ ఫోన్ లకు One UI 4 ఆధారిత Android 12 అప్డేట్ రానుంది. ఈ ఫోన్స్ కూడా యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే అప్డేట్ అందుకున్నాయి. అయితే S10 సిరీస్ వినియోగదారులు మాన్యువల్ గా ఈ అప్డేట్ పొందాల్సి ఉంటుంది. అందుకోసం ఫోన్లోని “Settings > Software update”లోకి వెళ్లి OS అప్డేట్ పొందాల్సి ఉంటుంది.

Also Read: South Cinemas Box office: ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన టాప్ దక్షిణాది చిత్రాలు

ఇక తైవాన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం అసూస్, తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ZenPhone 8 సిరీస్ కు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అందించనుంది. అయితే పరిమిత ఫోన్లకు మాత్రమే ఈ OS అప్డేట్ అందుతుందని కంపెనీ తెలిపింది. Zenfone 8 లోని ZS590KS మోడల్ కు, Zenfone 8 Flip ఫోన్ లోని ZS672KS మోడల్ కు మాత్రమే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రానున్నట్లు సమాచారం. అసూస్ లోని గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ROG Phone 5, ROG Phone 5s, ROG Phone 3, ఫోన్లకు కూడా రానున్న 2022 జనవరిలోనే ఆండ్రాయిడ్ OS అప్డేట్ రానున్నది.

Also Read: Viral Video: కవాతుకు అడ్డొచ్చిన చిన్నారి కాలును తొక్కిన సైనికుడు