South Cinemas Box office: ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన టాప్ దక్షిణాది చిత్రాలు

అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మొదటి మూడురోజుల్లోనే 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది

South Cinemas Box office: ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన టాప్ దక్షిణాది చిత్రాలు

Cinema

South Cinemas Box office: అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మొదటి మూడురోజుల్లోనే 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు కొట్టింది పుష్ప చిత్రం. కోవిడ్ మహమ్మారి పీడ ఇంకా వీడకముందే సగటు ప్రేక్షకుణ్ణి పుష్ప చిత్రం థియేటర్లకు రప్పించింది. ప్రధానంగా తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పుష్ప చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక హిందీలో అర్జున్ క్రేజ్ ను ఈ చిత్రం మరొక రేంజ్ కి తీసుకువెళ్ళింది. సినిమాలే లేక అల్లాడుతున్న హిందీ సినీ ప్రియులకు, పుష్ప చిత్రం ఎంతో వినోదాన్ని పంచింది. బాలీవుడ్ లో దక్షిణాది సత్తాను మరోసారి చాటి చెప్పింది పుష్ప. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న పుష్ప చిత్రం, దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన చిత్రాల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ పది చిత్రాల్లో పుష్ప ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. ఇండియాలో బాక్సాఫిస్ ను బద్దలు కొట్టిన ఆ టాప్ దక్షిణాది చిత్రాలు ఏమిటి.

Also read: Viral Video: కవాతుకు అడ్డొచ్చిన చిన్నారి కాలును తొక్కిన సైనికుడు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 చిత్రం ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంది. 2017లో విడుదలైన ఈచిత్రం Rs. 1351 కోట్ల వసూళ్లతో ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రం. రూ. 507 కోట్ల వసూళ్లతో రజనీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రం ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈలిస్టులో మూడో స్థానంలో ఉన్న చిత్రం బాహుబలి 1. రూ.482 కోట్లతో 2015లో వచ్చిన బాహుబలి చిత్రం దక్షిణాది చిత్ర సత్తాను ప్రపంచ వ్యాప్తం చేసింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం 339 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో చిత్రం రూ. 226.70 కోట్లతో ఐదో స్థానంలో ఉండగా..దాదాపు రూ. 223 కోట్లతో పుష్ప చిత్రం ఆరో స్థానంలో ఉంది. రూ. 221.50 కోట్ల వసూళ్లతో KGF: Chapter 1 ఏడో స్థానంలో, రూ. 218 కోట్లతో రోబో ఎనిమిదో స్థానంలో ఉండగా, విజయ్ నటించిన మాస్టర్, బిగిల్ చిత్రాలు దాదాపు రూ. 209 కోట్ల వసూళ్లతో తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి.

Also read: Jinnah Tower in Guntur: జిన్నా టవర్ చరిత్ర ఏమిటి?