Chennai : గత పదిరోజులుగా నీటిలోనే కాలనీలు.. పడవలపైనే ప్రయాణం

ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపుడుతోంది. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Chennai

Chennai : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపుడుతోంది. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్‌ చర్యలు తీసుకున్నారు.

చదవండి : Chennai Rains : వానలో పెళ్లి.. బోటులో వధూవరులను తీసుకెళ్లిన రెస్క్యూ టీం

కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక కొన్ని చోట్ల వర్షపు నీరుతోపాటు విషసర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పింట్లో ఉన్నారు. సీఎం స్టాలిన్ లోతట్టు ప్రాంతాల్లో ప్రర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తక్షణ సాయంగా నిత్యావసరాలను పంపిణి చేస్తున్నారు. ఇక గత పదిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

చదవండి : Chennai Rains: మునిగిన చెన్నై.. ఎల్లుండి ఏపీ, తమిళనాడుకు కుంభవృష్టి హెచ్చరిక