CM Bhupesh Baghel : ఢిల్లీ నో ఫ్లై జోన్‌ .. నేను ఎలా వెళ్లగలను..? : జీ20 డిన్నర్‌‌కు హాజరుకావటంపై సీఎం బఘేల్ వ్యాఖ్యలు

ఢిల్లీ ఇప్పుడు నో ఫ్లై జోన్‌గా మారింది కదా..మరి నేను డిల్లీ ఎలా వెళ్లగలను..? అంటూ సీఎం మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

CM Bhupesh Bagel

CM Bhupesh Baghel G20 Summit 2023 : జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. 2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన భారత్‌.. ఆయా దేశాధి నేతల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. మరికొద్దిగంటల్లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు జరగనున్నాయి. దేశాధి నేతల కోసం భారత్ ప్రభుత్వం ఏర్పాట్లనీ అత్యంత ఘనంగా ఏర్పాటు చేసింది. ఢిల్లీ మొత్తం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లిపోయింది. చీమ చిటుక్కుమన్నా అప్రమత్తంగా మారింది. ఇప్పటికే ఒక్కొక్కరిగా అతిథులు ఢిల్లీ చేరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh )ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ( CM Bhupesh Baghel)శుక్రవారం (సెప్టెంబర్ 8,2023) రాష్ట్రపతి ఇచ్చే జీ20 విందుకు హాజరుకావడం లేదని వెల్లడిస్తు దానికి కారణం కూడా తెలిపారు. ఢిల్లీ ఇప్పుడు నో ఫ్లై జోన్‌గా మారింది..మరి నేను. ఎలా వెళ్లగలను..?(Delhi no-fly zone. How do I go?) అంటూ సీఎం మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. జీ20 సమ్మిట్‌ను సందర్భంగా భద్రతా చర్యల వల్ల ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బయటకు విమాన రాకపోకలను ప్రభుత్వ నిషేధించింది.దీంతో సీఎం భూపేష్ ఇలా వ్యాఖ్యానించారు.

G20 Summit 2023 : జీ20 దేశాధినేతలకు బంగారు పాత్రల్లో విందు.. భారత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత!

కాగా..ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విషయాన్ని ముందుగానే తెలియజేసింది. జీ20 సమ్మిట్ స్పెషల్ విమానాలు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. సాధారణ ఏవియేషన్, నాన షెడ్యూల్డ్ విమానాలతో సహా అన్ని విమానాలు ఈ రెండు రోజుల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

కాగా జీ20 సమ్మిట్ సమావేశాల సందర్భంగా భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులకు భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఈ ఆహ్వానాలను మన్నించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణుడుకి 88 రకాల పిండి వంటలు చేసిన చంద్రమతి

అయితే ఈ విందుకు పలువురు విపక్షనేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించకపోవటం గమనించాల్సిన విషయం. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఉన్నారు. దీనిపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. కేంద్రం తీరును ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాలని..ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యం అంటూ విమర్శించారు.

కాగా జీ20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ బహుళజాతి కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా.. G20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 వరకు ప్రగతి మైదాన్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని భారత్ మండపంలో జరుగుతుంది.