Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణుడుకి 88 రకాల పిండి వంటలు చేసిన చంద్రమతి

కిట్టయ్య జన్మదినం వచ్చిదంటే చిన్నారుల్ని చిన్ని క్రిష్ణయ్యగా అలంకరించి తామే యశోదమ్మలుగా భావించి మురిసిపోతారు తల్లులు. ఆ క్రిష్ణుడు తమ బిడ్డే అనుకుని ఎన్నో రకాల పిండివంటలు నైవేద్యంగా పెడతారు. అటువంటి ఓ తల్లి క్రిష్ణయ్యకు 88 రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించింది.

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణుడుకి 88 రకాల పిండి వంటలు చేసిన చంద్రమతి

Updated On : September 8, 2023 / 3:21 PM IST

Krishna Janmashtami 2023 : చిలిపి పనులు చేసే కిట్టయ్య అంటే అందరు ఇష్టపడతారు. శ్రీకృష్ణుడు చేసే కొంటె పనుల వెనుక ఎన్నో మర్మాలున్నాయి. మరెన్నో జ్ఞానదీపికలు ఉన్నాయంటారు. గోపికల వస్త్రాలు దొంగిలించినా..వెన్న దొంగిలించినా..రాధమ్మతో ప్రేమాయణం సాగించినా కంసుడ్ని వధించినా అన్నీ లోక కల్యాణం కోసమే. అటువంటి కృష్ణుడి లీలలు అర్థం చేసుకోవటం చాలా కష్టమని అంటారు. అటువంటి కిట్టయ్య జన్మదినం వచ్చిదంటే చిన్నారుల్ని చిన్ని క్రిష్ణయ్యగా అలంకరించి తామే యశోదమ్మలుగా భావించి మురిసిపోతారు తల్లులు.

అటువంటి క్రిష్ణయ్య పుట్టిన రోజు అంటే అందరికి పండుగే. శ్రీకృష్ణ జన్మాష్టమిగా..గోకులాష్టమిగా జరుపుకుంటాం. క్రిష్టయ్యకు ఇష్టమైన వంటకాలతో నైవేద్యం పెడతాం. నైవేద్యంలో క్రిష్టయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న ఉండాల్సిందే. క్రిష్టయ్యను ఎంతో విశిష్టంగా ఆరాధించే ఓ భక్తురాలు శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami )సందర్భంగా ఎన్నో రకాల పిండి వంటకాలు చేసి కిట్టయ్యకు నైవేద్యంగా సమర్పించిది. కర్ణాటక చెందిన చంద్రమతి (Chandramati)అనే భక్తురాలు క్రిష్ణయ్యపై ఆమెకు ఆరాధనా భావాన్ని తెలియజేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna Janmashtami 2023 : ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారో మీకు తెలుసా?

కృష్ణాష్టమి సందర్భంగా చంద్రమతి క్రిష్టయ్యకు 88 రకాల పిండి వంటలను చేసి రాధామాధవుడికి నైవేద్యంగా సమర్పించారు. మంగళూరుకు చెందిన ఈ భక్తురాలు చంద్రమతి రావు.. ఏటా తాను తయారుచేసే పిండివంటల సంఖ్యను పెంచుకుంటూ.. తన రికార్డును తానే తిరగరాస్తున్నారు. క్రిష్ణయ్యకు చంద్రమతి చేసిన వంటకాల గురించి ..కృష్ణుడిపై ఆమెకున్న భక్తి గురించి మంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పి కామత్ ఈ ఫోటోలను షేర్ చేశారు.

చంద్రమతి రావు మల్టీ టాలెంటెడ్ మహిళ. కుమారుడు సహాయంతో మంగళూరులో ‘శుభ మంగళ’ టెక్స్‌టైల్ షోరూమ్ నిర్వహిస్తున్నారు. ఆమె ఎన్నో రకాల కుట్లు అల్లికలు చేస్తుంటారు. చిన్నప్ప నుంచి ఉన్న ఈ ఆసక్తితో ఆమె మొదట్లో చిన్నగా బట్టల వ్యాపారం ప్రారంభించారు. అది అలా పెంచుకంటు ఈరోజు కోట్ల రూపాయల టర్నోవర్ సాగిస్తున్నారు. ఆమె వందలాది మంది మహిళలకు ఉపాధిని కల్పించారు. మంగళూరులోని కెనరా జూనియర్ కాలేజీలో గౌరవ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కవిగా, కథా రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.