రూ.15లకే చికెన్ బిర్యాని

తమిళనాడులోని కోయంబత్తూరులో జనం బిర్యానీ కోసం ఎగబడ్డారు. కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి నూతనంగా హోటల్ ప్రారంభించాడు. హోటల్ ప్రారంభోత్సవం ఆఫర్ కింద 15 రూపాయలకే చికెన్ బిర్యానీ అందించనున్నట్టు ప్రకటించాడు.
ఎగ్‌బిర్యానీ పది రూపాయలకు అందిస్తున్నట్టు ప్రచారం చేశాడు. దీంతో జనాలకు బిర్యానీ కోసం బారులు తీరారు. వచ్చిన వారందకీ హోటల్ యజమాని, సిబ్బంది బిర్యానీ వడ్డించారు.
వందల్లో ఉండే చికెన్ బిర్యానీ ధర…కేవలం 15 రూపాయలకే అనే సరికి భోజన ప్రియులు హోటల్ కు పెద్ద ఎత్తున తరలించారు. బిర్యానీ కోసం భారీగా క్యూ కట్టారు. అసలే బిర్యానీ, ఆపై తక్కువ ధరకు అంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా..లొట్టలేసుకుంటూ పరుగెత్తారు.