Vaccine (1)
Covid Vaccination For Children: దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి-3,2022 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పొందేందుకు..అర్హులైనవారు జనవరి-1 నుంచే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కోవిన్ ఫ్లాట్ ఫాం చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.
రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఐడీ కార్డు- స్టూడెంట్ ఐడీ కార్డు(10వ తరగతి సర్టిఫికెట్)ను కూడా యాప్ లో చేర్చినట్లు తెలిపారు. కొందరు పిల్లలకు ఆధార్ కార్డు లేదా ఇతర ఐడీ కార్డులు లేకుండా ఉండే అవకాశముందని,కాబట్టి వాళ్లు తమ స్టూడెంట్ ఐడీ ద్వారా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని ఆర్ఎస్ శర్మ తెలిపారు.
మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సమయంలో 12-18 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్(BBV152)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)శనివారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో పిల్లల కోసం వినియోగించే కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం పొందిన రెండో సంస్థగా భారత్ బయోటెక్ నిలిచింది.
అంతకుముందు 12 ఏళ్లు పైబడినవారందరికీ జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన మూడు డోసుల డీఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించిన విషయం తెలిసిందే.
ALSO READ AP CM Jagan : ఏపీలో ఒమిక్రాన్..న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ? నైట్ కర్ఫ్యూ ?