India – China Visas: చైనానే మనకు వీసాలు ఇవ్వడంలేదు: భారత విదేశాంగశాఖ కార్యదర్శి

2020 నుంచి చైనా మనకు పర్యాటక వీసాలు ఇవ్వడం మానేసిందని..అరిందమ్ బాగ్చి వివరించారు. వీసాల జారీ ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు

India – China Visas: చైనీయులకు భారత పర్యాటక వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం..ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో భారత్ పర్యటనకు వచ్చిన చైనీయులు ఉన్నఫళంగా తమ దేశానికి వెళ్లిపోయారు. అయితే చైనీయులకు వీసాల జారీలో భారత్ తీసుకున్న నిర్ణయంపై భారత విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పందించారు. చెనీయులకు భారత పర్యాటక వీసా కావాలని రద్దు చేయలేదని..కరోనా కట్టడి నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన అరిందమ్ బాగ్చి..భారత్ కంటే ముందు చైనానే మనకు వీసాలు నిలిపివేసిందని వెల్లడించారు. 2020 నుంచి చైనా మనకు పర్యాటక వీసాలు ఇవ్వడం మానేసిందని..అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రస్తుతం కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నందున వీసాల జారీ ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు.

Also read:Uttar Pradesh : పెళ్లి కూతురును కాల్చి చంపిన మాజీ ప్రియుడు

ప్రస్తుతం చైనా తూర్పు ప్రాంతం, షాంఘై వంటి నగరాల్లో కరోనా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..ఇరు దేశాల మధ్య రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. కాగా, సుమారు 22,000 మంది భారతీయ విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో నమోదు చేసుకుని ఉన్నారు. కరోనా కారణంగా విద్యార్థులందరూ భారత్ కు తిరిగి వచ్చేశారు. గత రెండేళ్లుగా ఆ విద్యార్థులు ఆన్ లైన్ ద్వారానే తరగతులు వింటున్నారు. అయితే విద్యార్థులను తిరిగి యూనివర్సిటీకి అనుమతించే విషయమై అటు చైనా అధికారులుగాని, ఇటు భారతీయ దౌత్య అధికారులు గానీ..ఎటువంటి ప్రకటన చేయడం లేదు. దీంతో ప్రత్యక్ష తరగతులు, ప్రాక్టికల్ పరీక్షల్లో పాల్గొనలేక విద్యార్థుల భవితవ్యం సందిగ్ధంలో పడింది.

Also read:Shanghai Lockdown : షాంఘైలో మళ్లీ లాక్‌డౌన్… ఊరు ఖాళీ చేస్తున్న ప్రజలు

ట్రెండింగ్ వార్తలు