Uttar Pradesh : పెళ్లి కూతురును కాల్చి చంపిన మాజీ ప్రియుడు

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని వివాహం చేసుకోవటం తట్టుకోలేని మాజీ ప్రియుడు ఆమె పెళ్లి జరుగుతుండగా కాల్చి చంపాడు. 

Uttar Pradesh : పెళ్లి కూతురును కాల్చి చంపిన మాజీ ప్రియుడు

UP Bride Shot Dead

Uttar Pradesh :  ఉత్తరప్రదేశ్‌లోని మధురలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని వివాహం చేసుకోవటం తట్టుకోలేని మాజీ ప్రియుడు ఆమె పెళ్లి జరుగుతుండగా కాల్చి చంపాడు.

మధురలోని నౌజీల్ ప్రాంతంలోని ముబారక్ పూర్ గ్రామంలో శుక్రవారం వివాహ వేడుక జరుగుతోంది. వివాహ తంతులో భాగంగా జైమాల కార్యక్రమం ముగిసింది. పెళ్ళి కూతురు కాజల్ ఫ్రెష్ అప్ అయ్యేందుకు గదిలోకి వెళ్లింది.

ఆసమయంలో పెళ్లి మండపానికి వచ్చిన ఆమె మాజీ ప్రియుడు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. గదిలో నుంచి శబ్దం  రావటంతో కుటుంబ సభ్యులు గదివద్దకు చేరుకోగా ఆమె అప్పటికే మరణించి ఉంది.

కాజల్ తండ్రి ఖుబీరామ్ ప్రజాపతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు కూడా నిందితుడు పలుమార్లు  మృతురాలి  వివాహం చెడగొట్టినట్లు  ఆమె తండ్రి తెలిపారు.

Also Read : Gunturu : బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష