16 అడుగుల క్రిస్మస్ చెట్టు రూ.107కోట్లా!

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి వచ్చేసింది. స్పెయిన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్ బాహియా’ ఈ క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసింది. దీని పొడవు 16అడుగులు. సుమారు రూ.107.6కోట్ల (15 మిలియన్ డాలర్ల) విలువైన వజ్రాలతో దీన్ని అలంకరించడం విశేషం. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ అని భావిస్తున్నారు. 

తెలుపు, పింక్, ఎరుపు వజ్రాలతో పొదిగిన ఈ చెట్టు చూపరులను ఆకట్టుకుంటుంది. వీటితో పాటు బల్గరీ, కార్టియార్, వాన్ క్లెఫ్, ఆర్పెల్స్, చానెల్, పెర్ఫ్యూమ్స్, ఆస్ట్రిచ్ గుడ్లు, నెమలి ఆకారంలో 3డీ ప్రింటెడ్ చాక్లెట్ వంటి ఆభరణాలతో చెట్టును అలంకరిస్తున్నారు. 

అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో 2010లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ గిన్నీస్ వరల్డ్ రికార్డు గెలుచుకుంది. అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీను నెక్లెస్‌లు, బ్రాస్ లెట్లు, వాచ్‌లతో అలంకరించారు. దీని ఖరీదు రూ.78కోట్ల 70లక్షల 42వేల 300(11మిలియన్ అమెరికన్ డాలర్లు).

ట్రెండింగ్ వార్తలు