ఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అరుదైన రికార్డును నెలకొల్పింది. మార్చి 2న నోయిడాలో అత్యంత పొడవైన సింగిల్ లేన్ సైకిల్ పరేడ్ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 1,327 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆగకుండా.. నిరంతరాయంగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకర్షించారు. ఈ క్రమంలో సైకిల్ తొక్కేవారు ఏమాత్రం లైన్ క్రాస్ చేయకుండా.. ఒకే వరుసలో సమాన దూరం పాటిస్తూ 3.2 కిలోమీటర్లు ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కారు.
Also Read : హైదరాబాద్ లో కాంబ్లె ముఠా : పురుషుల మెడలో గొలుసులే టార్గెట్
గతంలో 1,235 సైకిళ్లతో భారత్‌లోని హుబ్బాలి బైస్కిల్ క్లబ్ నెలకొల్పిన రికార్డును సీఐఎస్ఎఫ్ బద్దలు గొట్టింది. ఈ కార్యక్రమానికి ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ గమాలెల్దిన్ అహ్మద్ గబర్ గిన్నిస్ ప్రతినిధిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీఐఎస్‌ఎఫ్‌కు గిన్సిస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.
Also Read : ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు