CISF Rescue Girl: భళా సీఐఎస్‌ఎఫ్: సాహసంతో బాలికను రక్షించిన సీఐఎస్‌ఎఫ్ జవాన్

భవనంలోని పైఅంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇనుప గ్రిల్స్ లో చిక్కుకున్న బాలికను సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఎంతో సాహసంతో రక్షించాడు.

Cisf

CISF Rescue Girl: మెట్రో స్టేషన్ భవనంలోని పైఅంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇనుప గ్రిల్స్ లో చిక్కుకున్న బాలికను సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఎంతో సాహసంతో రక్షించాడు. ఈఘటన ఆదివారం నాడు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. ఫిబ్రవరి 27 సాయంత్రం 6 గంటల సమయంలో ఎనిమిదేళ్ల బాలిక ఆడుకుంటూ మెట్రో స్టేషన్ లోని రెండో అంతస్తులో పెద్ద కిటికీ వద్ద ఇనుప గ్రిల్ లో ఇరుక్కుపోయింది. బాలిక అరుపులు విన్న అక్కడివారు మెట్రో అధికారులకు సమాచారం ఇచ్చారు. మెట్రో అధికారులు బాలిక గురించి CISF క్యూఆర్‌టికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన మెట్రో స్టేషన్ కు చేరుకున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. బాలికను రక్షించేందుకు అన్నివిధాలా శ్రమించారు.

Also read: Hyderabad : కావూరి హిల్స్ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

ఇంతలో సిబ్బందిలో నాయక్ అనే జవాన్.. ఎంతో సాహసంతో.. ఎటువంటి ఆధారం లేకుండానే బాలిక వద్దకు చేరుకొని.. నెమ్మదిగా బాలికను కిందకు చేర్చాడు. 25 అడుగుల ఎత్తున్న కిటికీ వద్దకు చేరుకున్న CISF జవాన్.. గ్రిల్ ను ఒక చేత్తో, బాలికను మరో చేతితో పట్టుకుని.. గోడను ఆధారంగా చేసుకుని ఎంతో జాగ్రత్తగా బాలికను కిందకు చేర్చాడు. అనంతరం కిందనున్న CISF జవాన్లు బాలికను ఆదుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలకు తెగించి బాలికను రక్షించిన CISF జవాన్ నాయక్ ను అందరూ ప్రశంసించారు. ఇక ఈఘటనకు సంబందించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జవాన్ నాయక్ సాహసాన్ని నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు.


Also read: Chittoor Home Guard : ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు మరో పెళ్లికి సిధ్దమైన హోం గార్డు