Madhabi Puri Buch: సెబీ చ‌రిత్ర‌లో తొలి మహిళా చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌బి పూరీ బుచ్

సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ బాస్ గా నియమితులయ్యారు.SEBI) నూత‌న చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌బి పూరీ బుచ్ నియ‌మితుల‌య్యారు.

Madhabi Puri Buch: సెబీ చ‌రిత్ర‌లో తొలి మహిళా చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌బి పూరీ బుచ్

Madhabi Puri Buch Appointed As Sebi Chairperson

Madhabi Puri Buch :  సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Securities and Exchange Board of India) (SEBI) చరిత్రలో తొలిసారిగా ఓ అతివ బాస్ గా నియమితులయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) నూత‌న చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌బి పూరీ బుచ్ (Madhabi Puri Buch) నియ‌మితుల‌య్యారు. దీనికి సంబంధించి కేబినెట్ అపాయింట్స్ మెంట్ క‌మిటీ మాధ‌బి పూరీ బుచ్ నియామ‌కానికి సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాలపాటు మాధవి ఈ ప‌ద‌విలో ఉండనున్నారు. ఈ నియామ‌కంతో సెబీ (SEBI) చ‌రిత్ర‌లో ఓ మ‌హిళ చైర్ పర్సన్ గా నియ‌మితులు కావటంతో మాధవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సెబీ చైర్మ‌న్ అజ‌య్ త్యాగి ఐదేళ్ల ప‌ద‌వీ కాలం సోమ‌వారం (ఫిబ్రవరి 28,2022)తో ముగిసింది. ఈ క్రమంలో మాధ‌బిని సెబీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

Also read : Ukriane-Russia War: శరణమా? మరణమా? 5300 మంది రష్యా సైనికులు హతమయ్యారు -యుక్రెయిన్ రాయబారి

మాధ‌బి పూరీ బుచ్ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐలో కెరీర్ ప్రారంభించారు. అలా 20 ఏళ్లు అదే బ్యాంకులో పలు హోదాల్లో ప‌నిచేశారు. 2009 నుంచి 2011 మ‌ధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగానే కాకుండా సీఈఓగా కూడా వ్య‌వ‌హ‌రించారు. మాధవి సెబీ మాజీ హోల్ టైమ్ మెంబర్. మార్కెట్ రెగ్యులేటరీ ఏర్పాటు చేసిన సరికొత్త టెక్నాలజీ కమిటీకి ఆమె లీడ్‌గా అంతకుముందు నామినేట్ అయ్యారు. బుచ్ సెబీకి హోల్ టైమ్ మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ మాత్రమే కాక, ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తి కూడా మాధవీనే కావటం విశేషం. ఐసీఐసీఐ బ్యాంకులో మాధవి బుచ్ తన కెరీర్‌ను ప్రారంభించి..ఫిబ్రవరి 2009 నుంచి మే 2011 వరకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్‌పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు.

అజయ్ త్యాగి పదవీ కాలం ముగుస్తుండటంతో.. ఛైర్మన్ పోస్టు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ దరఖాస్తులను కోరగా..ఈ అప్లికేషన్ల సబ్మిట్ చేయటానికి డిసెంబర్ 6 వరకు సమయమిచ్చింది. రెగ్యులేటర్స్ నియామకాల ప్రొసీజర్ ప్రకారం..కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫైనాన్సియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్స్ సెర్చ్ కమిటీ (Financial Sector Regulatory Appointments Search Committee) అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తుంది. పలు సంప్రదింపులను ఆధారంగా చేసుకుని, పలువురి పేర్లను ప్రధాని మోడీ నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీకి Financial Sector Regulatory Appointments Search Committee సిఫారసు చేస్తుంది.

Also read : Russia-Ukraine war :.‘మా దేశం విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోండి’ రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్.

క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ మాధవి నియామకం పట్ల అభినందనలు తెలిపారు. ఇలా ట్వీట్ చేశారు: “భవిష్యత్తులో SEBI లో గొప్ప విషయాలు జరుగుతాయని నేను ఆశిస్తున్నానని..SEBIకి ఛైర్ పర్సన్ గా నియమితులైన మాధవికి అభినందనలు అని తెలిపారు.