Ukriane-Russia War: శరణమా? మరణమా? 5300 మంది రష్యా సైనికులు హతమయ్యారు -యుక్రెయిన్ రాయబారి

యుక్రెయిన్‌లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్‌లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్‌లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు.

Ukriane-Russia War: శరణమా? మరణమా?  5300 మంది రష్యా సైనికులు హతమయ్యారు -యుక్రెయిన్ రాయబారి

Ukrain

Ukriane-Russia War: యుక్రెయిన్‌లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్‌లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్‌లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు. రష్యా కార్యకలాపాల శృతి మించడంతో బాంబు దాడులు, కాల్పుల తర్వాత ఇప్పటికే 16 మంది పిల్లలు చనిపోయారు. యుద్ధం ఆగకపోతే శరణార్థుల సంఖ్య 7 మిలియన్లు దాటే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు.

రష్యాతో చర్చలపై రాయబారి మాట్లాడుతూ, “ఈ రోజు(27 ఫిబ్రవరి 2022) మా ప్రతినిధుల బృందం శాంతి చర్చల కోసం బెలారస్‌కు వెళ్లింది. అయితే శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో కూడా బాంబు దాడులు చోటుచేసుకోవడం బాధాకరం” అని అన్నారు.

రష్యా విమానాలకు ఐరోపాలోని ఆకాశమార్గం ఇప్పటికే మూసేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ కుప్పకూలుతోంది. రష్యా ఇంకా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే దాదాపు 5వేల 300 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యాతో చర్చల ప్రధాన లక్ష్యం తక్షణమే కాల్పులు విరమించి రష్యన్ దళాలను వెనక్కి రప్పించుకోవాలని యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం అభిప్రాయపడింది.

కీవ్ ఇప్పటికీ యుక్రెయిన్ నియంత్రణలోనే:
యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ ఇప్పటికీ రాజధాని నగరంలోనే ఉంది. రాత్రి సమయంలో కీవ్ శివార్లలో రష్యా దళాలు ఎంటర్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. యుక్రేనియన్ దళాలు ఇప్పటికీ కీవ్‌ను తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయి. యుక్రేనియన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ ఫేస్‌బుక్‌లో ఆమేరకు పోస్ట్ చేసింది.

రష్యన్ దళాలు ప్రధాన ప్రాంతీయ నగరాలను చేజిక్కించుకోవడంలో విఫలమయ్యాయి. యుక్రేనియన్ దళాలు రష్యన్‌లను ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. యుక్రెయిన్ స్థానిక ఏజెన్సీ జిన్హువా వార్తా సంస్థ ప్రకారం.. ఖార్కివ్, కైవ్, చెర్నిహివ్ సహా పలు నగరాలపై రష్యా సైనికులు వైమానిక దాడులు చేసినప్పటికీ యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ మాత్రం దాడులను ఎదుర్కొంటోంది.