Russia-Ukraine war :.‘మా దేశం విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోండి’ రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్.

రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్ స్కీ వార్నింగ్..‘మా దేశం విడిచిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకోండి..’అంటూ హెచ్చరించారు.

Russia-Ukraine war :.‘మా దేశం విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోండి’ రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్.

Ukraine President Zelensky Warns Russia Army

Russia-Ukraine war : రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్ స్కీ వార్నింగ్..‘మా దేశం విడిచిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకోండి..’అంటూ హెచ్చరించారు. రష్యాకు వ్యతిరేకంగా పోరులో మీరు మాతో కలిసి వస్తే రష్యా యుద్ధ ఖైదీలను వదిలేస్తాం అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇప్పటికే తాము రష్యాకు చెందిన 5వేల 300లమంది సైనికులను హతమార్చామని తెలిపారు జెలెన్ స్కీ.

Also read : Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

రష్యాకు చెందిన 191 యుద్ధ ట్యాంకులు,816 సైనిక వాహనాలను,29 ఫైటర్ జెట్ లు,29 మెలికాప్టర్ లను కూల్చివేశామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. యుక్రెయిన్ రక్షణ కోసం తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని.. ఆయుధాలు వదిలిపెట్టబోమని ఆ దేశ జెలియెన్క్సీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.మా దేశ రాజధాని కీవ్ పూర్తిగా ఆక్రమించుకోవాలన్న రష్యా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని రష్యా ఆర్మీ యుక్రెయిన్ చేతిలో చావుదెబ్బద తిన్నదని ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధంలో నైతికంగా విజయం మాదేనని యుక్రెయిన్ ప్రకటించింది. రష్యా సైనికులు యుక్రెయిన్ సైనికులను చూసి భయపడుతున్నారని వెల్లడించింది.

Also read : Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

మిలటరీ స్థావరాలతో పాటు సాధారణ ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో కూడా రష్యా దాడులు చేసిందని రష్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా కీవ్ ను తమను ఏమీ చేయలేకపోయిదని యుక్రెయిన్ రక్షణ మంత్రి అధికారికంగా ప్రకటించారు.మేం చేసిన ఎదురు దాడికి రష్యా మానసిక స్థైర్యంకోల్పోయిందని బలహీన పడింది అని యుక్రెయిన్ తెలిపింది.రష్యా సేనలను ఎక్కడిక్కడ యుక్రెయిన్ నిలువరిస్తోంది. రష్యాపై నైతిక విజయం మాదేని రష్యా మానసిక స్థైర్యాన్ని కోల్పోయిందని యుక్రెయిన్ రక్షణ శాఖా తెలిపింది.