Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ కానున్నాయి.

Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

Un To Hold 2 Meetings Monday On Russia's Invasion Of Ukraine

Russia-Ukraine war : కానున్నాయి..యుక్రెయిన్ లో రష్యా యుద్ధం వంటి అంశాలపై చర్చించేందుకు 193 దేశాలు చర్చించటానికి సిద్ధమయ్యాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న క్రమంలో అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు 193 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేక సమావేశానికి రంగం సిద్ధంచేసింది. 15 సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగులో పాల్గొని నిర్ణయం తీసుకున్నాయి.

Also read : Ukraine-Russia Crisis : ర‌ష్యా సైనిక కాన్వాయ్‌ను పేల్చేసిన యుక్రెయిన్ డ్రోన్లు.. వీడియో..!

కాగా..భారత్‌ ఈ ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్యను ఖండిస్తూ భద్రతా మండలిలో చేసిన తీర్మానానికీ భారత్‌ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.అంటే భారత్ తటస్థంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎప్పటినుంచో రష్యాతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్న భారత్ రష్యాతో విభేదం పెంచుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేనట్లుగా అర్థం చేసుకోవచ్చు.

కాగా.. రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఇలా ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఇటువంటి అసాధారణ సమావేశాలు గత 70సంవత్సరాల్లో 10 సందర్భాల్లో మాత్రమే జరిగాయి. యుక్రెయిన్‌-రష్యా వివాదంపై భద్రతా మండలి ఇటీవల భేటీ అయిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారడంతో ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న 193 దేశాలు మరోసారి సమావేశంకానున్నాయి.

Also read : Russia Ukraine War: యుక్రెయిన్ లో కొన‌సాగుతున్న దాడులు ప్ర‌తిదాడులు

ఉక్రెయిన్‌కు ఈయూ సహాయం.. యుద్ధ విమానాలు తరలింపు…
రష్యా దాడులను ఉక్రెయిన్‌కు సమర్థవంతంగా అడ్డుకుంటున్నా..రష్యా కంటే చిన్నదేశం ఎంతని పోరాడగలదు? ఎన్ని రోజులని నిలువరించగలదు? అలా యుక్రెయిన్ ఓ పక్క రష్యాకు భయపడకుండా పోరాడుతునే మరో పక్క పలు దేశాల సహాయాన్ని అర్థించింది. దీంతో ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు అందజేస్తున్న ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్య దేశాలు తాజాగా యుద్ధ విమానాలను సైతం పంపడానికి సిద్ధమయ్యాయి. దీని గురించి ఐరోపా సమాఖ్య విదేశీ విధానం విభాగపు అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ మాట్లాడుతూ..‘‘మేం యుద్ధ విమానాలను కూడా పంపుతామని యుక్రెయిన్ కు భరోసా ఇచ్చారు. కేవలం ఆయుధాలు పంపడం గురించే మాట్లాడడం లేదు. యుద్ధానికి కావాల్సిన కీలక ఆయుధాలను సైతం అందజేస్తున్నామని తెలిపారు.